పాఠశాల విద్యార్థులకు పొడి చెత్తపై ప్రత్యేక బహుమతుల అందజేత
రిపోర్టర్: కిరణ్
స్థలం: గుంటూరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులలో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇంట్లో ఉండే పొడి చెత్తను పాఠశాలకు తెచ్చి ఇస్తే విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. వ్యర్థాల వర్గీకరణను విద్యార్థులకు చిన్నతనం నుంచే అలవాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.