గిన్నిస్ బుక్ రికార్డులో నెల్లూరు మహిళా ఫిజియోథెరపిస్ట్ షీబా కౌసర్ సంచలన విజయం

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

ఫిజియోథెరపీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన నెల్లూరుకు చెందిన మొహమ్మద్ షీబా కౌసర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నట్లు ఆమె తెలిపారు. వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వినూత్న ప్రయోగాలు చేసినందుకు గాను ఐఐటీ మద్రాస్లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ ప్రతినిధులు ఆమెకు ఈ అధికారిక అవార్డును అందజేశారు. ఈ విజయంతో నెల్లూరు జిల్లాకు చెందిన షీబా కౌసర్కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.