దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో ఏడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ప్రపంచ దేశాలకు ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో ఏపీ ఏడో స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డీజీఎఫ్టీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏపీ నుంచి రూ.1.77 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి కాగా, దేశ మొత్తం ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 4.57 శాతంగా ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు తొలి మూడు స్థానాలు దక్కించుకోగా, తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది.