లాస్ వెగాస్ రైడర్స్ లో టామ్ బ్రాడీ పెట్టుబడి భారీ లాభాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: World

ఎన్ఎఫ్ఎల్ దిగ్గజం టామ్ బ్రాడీ లాస్ వెగాస్ రైడర్స్ జట్టులో చేసిన పెట్టుబడి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. అక్టోబర్ 2024లో టామ్ బ్రాడీ, టామ్ వాగ్నర్ కలిసి 220 మిలియన్ డాలర్లు వెచ్చించి ఈ జట్టులో పది శాతం వాటాను కొనుగోలు చేశారు. తాజాగా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ జట్టు విలువ ఏకంగా 13 బిలియన్ డాలర్లకు పెరగడంతో బ్రాడీ పెట్టుబడి అత్యంత విజయవంతమైంది.