భారత్‌లో ఫార్ములా-1 రేసుల పునరుద్ధరణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

భారత్‌లో మోటార్‌స్పోర్ట్స్, ఫార్ములా-1 రేసుల పునరుద్ధరణ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్‌కు చెందిన యుగల్ కిషోర్ జోషి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. 2028 నాటికి దేశంలో ఫార్ములా-1 రేసు నిర్వహణ సాధ్యసాధ్యాలపై ఈ టాస్క్‌ఫోర్స్ సమగ్ర అధ్యయనం చేయనుంది. పన్నులు మరియు ఇతర సవాళ్లపై సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.