ఖమ్మంలో పట్టభద్రుల ఓటరు నమోదులో జోరు పెంచిన బీజేపీ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం రోటరీ నగర్ తొమ్మిదో డివిజన్ లో కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని వారు సూచించారు. ఇప్పటివరకు రెండు వందల యాభై మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.