పింక్ కలర్ అంటే అసలు పడదంటున్న రాష్ట్ర మంత్రి

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక సీనియర్ మంత్రికి పింక్ రంగుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. తన పేషీలో ఫైల్స్, నోట్స్, స్టేషనరీ మరియు టవల్స్ వంటి వాటిలో పింక్ కలర్ అస్సలు ఉండకూడదని ఆయన కఠిన నిబంధనలు విధించారు. అసెంబ్లీకి సంబంధించిన నోట్స్ ప్రింటింగ్‌లో పింక్ కలర్ రావడంతో సిబ్బంది హడలిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక రంగు కావడంతోనే ఆ మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయం మరియు అసెంబ్లీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.