ప్రాంక్ పేరుతో సహోద్యోగిపై గాలి గొట్టంతో అఘాయిత్యం

రిపోర్టర్: నరేష్ స్థలం: మెహ్సానా

గుజరాత్లోని మెహ్సానా జిల్లా కడి పారిశ్రామిక ప్రాంతంలో సహోద్యోగులు చేసిన ప్రమాదకరమైన ప్రాంక్ కారణంగా చందన్భాయ్ సురేశ్భాయ్ దంతానీ తీవ్రంగా గాయపడ్డారు. జులై 26న రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్న సమయంలో నిందితులు బలవంతంగా పట్టుకుని హైప్రెషర్ ఎయిర్ పైప్ను శరీరంలోకి వదలడంతో ఆయన పేగులు దెబ్బతిన్నాయి. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.