ఆస్ట్రేలియా గడ్డపై బీజేపీ నేతలతో మల్లారెడ్డి భేటీ రాజకీయంగా కలకలం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీజేపీ నేతలతో కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు మరియు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో కలిసి విదేశాల్లో టూవుంబా మేయర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుందని రాజకీయ పరిశీలకులు తెలిపారు.