ఉత్తరప్రదేశ్ లో భార్య పూజారులను కాల్చి చంపి పోలీసు ఎన్ కౌంటర్ లో నిందితుడు మృతి
రిపోర్టర్: అశోక్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ లోని అజమ్ గఢ్ లో భార్య, ఇద్దరు పూజారులను కాల్చి చంపి ముగ్గురు పిల్లలను బందీగా చేసుకున్న అర్వింద్ సింగ్ అనే వ్యక్తి పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. ఏడు గంటల పాటు సాగిన ఉద్రిక్తత తర్వాత పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడితో పాటు అతడు కాల్పులు జరపడంతో గాయపడిన కుమారుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.