గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించే కీలక లక్షణాలు ఇవే
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
గుండెపోటు ఎప్పుడూ తీవ్రమైన నొప్పితోనే రాదని, కొన్నిసార్లు నిశ్శబ్దంగా వచ్చే చిన్న సంకేతాలనే గమనించాలని గ్లెన్ఈల్స్ ఆసుపత్రి కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సాయి సుధాకర్ వెల్లడించారు. మెట్లు ఎక్కేటప్పుడు తీవ్రమైన అలసట, సాధారణ పనుల్లో ఆయాసం, ఛాతిలో బిగుతుగా అనిపించడం వంటి వాటిని కేవలం అసిడిటీగా కొట్టిపారేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆయన హెచ్చరించారు. మహిళలు, వృద్ధులలో ఈ లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు.