వన్యప్రాణుల సంరక్షణ దళం హీరో జోర్బా మృతి: అస్సాంలో విషాదం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Guwahati

అస్సాంలోని ప్రసిద్ధ కాజిరంగా నేషనల్ పార్క్ లో అడవి జంతువుల రక్షణకు కృషి చేసిన ప్రముఖ యాంటీ పోచింగ్ జాగిలం జోర్బా అనారోగ్యంతో గౌహతిలో మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆరాన్యక్ సంస్థకు చెందిన కెనైన్ యూనిట్ లో కీలక పాత్ర పోషించిన ఈ బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్క, తన కెరీర్ లో అరవైకి పైగా వేటగాళ్లను పట్టుకోవడంలో అటవీ అధికారులకు ఎంతో సహాయపడిందని, దీని మృతి పట్ల వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.