టిడ్కో లబ్ధిదారులకు వాటా సొమ్ము చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

రిపోర్టర్: నరేష్ స్థలం: రాజాం

రాజాం పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో అర్హత కోల్పోయిన 772 మంది టిడ్కో గృహ లబ్ధిదారులకు రూ.11,63,100 విలువైన వాటా సొమ్ము చెక్కులను ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పంపిణీ చేశారు. గత వైకాపా ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్ల కేటాయింపులను రద్దు చేయడంతో పాటు వారు చెల్లించిన సొమ్మును ఇవ్వలేదని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిదేళ్ల తర్వాత ఆ సొమ్మును తిరిగి చెల్లించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.