బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు: ఎఫ్డీఏ నోటీసులపై సవాల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Mumbai

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది. విమల్ ఇలాచి టెలివిజన్ ప్రకటనలో నటించినందుకు అధికారులు ఈ నోటీసులు ఇవ్వగా, తయారీ కంపెనీని కాకుండా తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన తన పిటిషన్లో వాదించారు. ఈ పిటిషన్ను నవంబర్ నాల్గవ తేదీన ధర్మాసనం విచారించనుంది.