లారీలకు మరింత లోడింగ్ కల్పించాలంటూ కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ విజ్ఞప్తి

రిపోర్టర్: రాము స్థలం: సత్తుపల్లి

సత్తుపల్లి సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు లారీ యజమానులకు మరింత లోడింగ్ అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ లారీ యూనియన్ నాయకులతో కలిసి ఏరియా జనరల్ మేనేజర్‌ను కలిశారు. బొగ్గు ఉత్పత్తిని పెంచి లారీలకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చూడాలని ఆయన కోరారు. లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్‌కు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.