నర్సంపేట నూతన బార్ లైసెన్స్ను లాటరీలో దక్కించుకున్న తాటికొండ మూర్తి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నర్సంపేట

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో కొత్త రెండు బీ బార్ లైసెన్స్ను లాటరీ పద్ధతి ద్వారా తాటికొండ మూర్తికి కేటాయించారు. టోకెన్ నంబర్ పంతొమ్మిది కలిగి ఉన్న ఆయన ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ లైసెన్స్ కోసం మొత్తం నూట ముప్పై ఒక్క దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు లక్ష రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ ఫీజు వసూలు చేశారు.