విశాఖలో భారీగా విదేశీ బంగారం పట్టుబడకం: రూ.8.98 కోట్ల విలువైన పసిడి సీజ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జాతీయ రహదారిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు కారులో రహస్యంగా తరలిస్తున్న సుమారు ఎనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన అయిదు కిలోల ఎనిమిది వందల ఎనభై మూడు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా అక్రమంగా ఈ పసిడిని తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని, ఈ ఘటనపై ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.