ఉజ్జయినిలో విషాదం: హోటల్ వ్యర్థాల గదిలో విషవాయువు పీల్చి నలుగురు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: Ujjain
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో శ్రీ గంగా హోటల్ లో భూగర్భ వ్యర్థాల గదిని శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి నలుగురు కార్మికులు మృతి చెందినట్లు ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ వెల్లడించారు. దేవాస్ రోడ్డులో ఉన్న ఈ హోటల్ లో శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ దారుణం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.