కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం: పోలీస్ స్టేషన్లోనే న్యాయవాదుల మధ్య ఘర్షణ
రిపోర్టర్: సురేష్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయవాదుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఓ కేసు విచారణ విషయంలో బుధవారం లాయర్ మల్లికార్జునపై దాడి జరగడంతో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఏఏఎస్పీ ఎదుటే వాగ్వాదం జరిగి ఘర్షణ చోటుచేసుకుందని, ఈ ఘటనలో బీజేపీ నేత, హైకోర్టు న్యాయవాది పురుషోత్తంరెడ్డికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.