లింగంపల్లి రైల్వే స్టేషన్ లో సైబర్ నేరాలపై మేడ్చల్ మల్కాజిగిరి పోలీసుల అవగాహన

రిపోర్టర్: సతీష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఓటీపీ దొంగతనాలు, నకిలీ పెట్టుబడులపై సైబరాబాద్ పోలీస్ శాఖ అవగాహన కల్పించింది. సైబర్ భద్రతను పెంపొందించేందుకు పోలీస్, ఆర్పీఎఫ్, జీఆర్పీ మరియు రైల్వే అధికారులు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో మోసపోకుండా సురక్షిత పద్ధతులు పాటించాలని ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు.