సోషల్ మీడియా నెగెటివిటీపై ఘాటుగా స్పందించిన సంజూ శాంసన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో విజయం అనంతరం ఓపెనర్ సంజూ శాంసన్ సోషల్ మీడియా విమర్శలపై తీవ్రంగా స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో మా మధ్య ఎలాంటి పోటీలేదని, మేమంతా దేశం కోసం ఆడుతున్నామని స్పష్టం చేశాడు. విమర్శలు తనను కూడా బాధిస్తాయని, అయితే వాటిని ఎదుర్కొంటూ ఆటపైనే దృష్టి సారిస్తానని తెలిపాడు. వైభవ్ సూర్యవంశీతో పోటీ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు.