చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఘనంగా వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: చిత్తూరు
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 4 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. తొలి రోజు స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, పట్టు వస్త్రాల సమర్పణ జరిగాయి. రాత్రి మూషిక వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.