రాజమౌళి దర్శకత్వ శైలిపై ప్రైత్విరాజ్ సుకుమారన్ ప్రశంసలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన పనితీరును కొనియాడారు. రాజమౌళి నటుల అభిప్రాయాలను గౌరవిస్తారని, షూటింగ్‌కు ముందు ప్రతి సీన్‌పై ఆరోగ్యకరమైన చర్చ జరుపుతారని తెలిపారు. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనున్నారు. ప్రతినాయకుడి పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నారు.