జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు పురస్కారాలు దక్కించుకున్న కల్కి సినిమా
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: New Delhi
భారతీయ సినీ రంగంలో చారిత్రాత్మక విజయం సాధించిన కల్కి 2898 ఏడీ చిత్రానికి 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు లభించగా, ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు దక్కింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ఈ వేడుకలో పాల్గొన్నారు.