గణేష్ ఉత్సవాల నిర్వహణలో పోలీసు నిబంధనలు కచ్చితంగా పాటించాలి.. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని హెచ్చరిక
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని కాశీబుగ్గ డిఎస్పి టి భవాని స్థానిక పోలీస్ స్టేషన్ లో నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ మండప ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకూడదని స్పష్టం చేశారు. రాత్రి పది గంటల తర్వాత డీజేల వినియోగం నిషిద్ధమని, విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. బలవంతపు చందాలు వసూలు చేయడం, మత సామరస్యానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.