రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో రేపు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌కు TPDMA పిలుపునిచ్చింది. బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి.