యువతరం విజ్ఞాన జ్యోతులతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని జయశ్రీ ఫంక్షన్ హాల్లో నలంద డిగ్రీ, అరవిందో జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ పి. విష్ణుకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చైర్మన్ బత్తుల శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అభ్యసించి నూతన ఆవిష్కరణలతో సమాజ వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కరస్పాండెంట్ ఎం. రాజశేఖర్ కోరారు. ఈ వేడుకల్లో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.