సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తారకరత్న ఏఐ ఫొటోలు
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న ఏఐ టెక్నాలజీ సాయంతో తయారు చేసిన 80వ దశకం నాటి ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలేఖ్య షేర్ చేసిన ఈ రొమాంటిక్ ఏఐ జనరేటెడ్ చిత్రాలు నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.