ట్రాన్స్ జెండర్లకు భారీ ఊరట: పోలీసు కొలువుల కోసం ప్రత్యేక కోచింగ్

రిపోర్టర్: మహేష్ స్థలం: Malkajgiri

పోలీస్ శాఖలో చేరి ప్రజలకు సేవలందించాలని ఆశిస్తున్న ట్రాన్స్ జెండర్లకు తెలంగాణ పోలీసు శాఖ అండగా నిలిచింది. మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి సారధ్యంలో ఇరవై మంది ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల కోచింగ్, హాస్టల్ ఖర్చుల కోసం మూడున్నర లక్షల రూపాయల నిధులను సాధికారత శాఖ మంజూరు చేసిందని సీపీ సుమతి తెలిపారు.