రాజాపేటలో 'చలో హైదరాబాద్' పోస్టర్ ఆవిష్కరణ.. తరలిరావాలని పిలుపు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో శనివారం టీజీజేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న హైదరాబాద్లో జరగనున్న 'చలో హైదరాబాద్' ఉద్యోగుల హక్కుల సాధన సభ పోస్టర్ను తహసీల్దార్ గోలి రవి కిరణ్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కూతల నాగమణి మాట్లాడుతూ, రాజాపేట మండలం నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.