ఇమ్రాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు మొట్టికాయలు: నిరసనలపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: ముంబై
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్ పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు కలిగిన అమెరికన్ పౌరుడైన ఆయనకు భారత పౌరుడిలా వ్యవహరించే హక్ కు లేదని కోర్టు స్పష్టం చేసింది. అమెరికాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత పౌరుడు నిరసన తెలిపితే ఊరుకుంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు.