చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర నిప్పులు

రిపోర్టర్: అశోక్ స్థలం: Chittoor

రాయలసీమకు వైఎస్సార్ కుటుంబం వరమైతే చంద్రబాబు నాయుడు శాపమని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. నగరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాయలసీమ తీవ్ర దుర్భిక్షంలోకి వెళ్లిందని ఆరోపించారు. ఈవీఎంల మేనేజ్మెంట్తో అధికారంలోకి వచ్చిన వారికి బ్యాలెట్ బాక్సులంటే భయం పట్టుకుందని మండిపడ్డారు. సీమ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను అమరావతి రియల్ ఎస్టేట్ కోసం తరలిస్తున్నారని ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.