పెద్దకొండూరు గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన శిరీష

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామ సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. పూల బతుకమ్మలతో గ్రామమంతా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.