చిన్నచిన్న సమస్యలకే కుంగిపోవద్దు త్యాగధనుల బాటలో నడవాలని మంత్రి లోకేశ్ పిలుపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కాకినాడ

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం దేశభక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు చిన్నచిన్న సమస్యలకే కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.