నవంబర్ మొదటి తేదీ నుంచి రాష్ట్రంలో ధాన్యం సేకరణ
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నవంబర్ మొదటి తేదీ నుంచి ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలో జరిగిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం రెండు వేల ఆరు వందల పంతొమ్మిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.