సూడాన్‌లో ఘోర బంగారు గని ప్రమాదం పదకొండు మంది మృతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సూడాన్
సూడాన్‌లోని రెడ్ సీ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర గని ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా మరో 30 మంది గాయపడ్డారు. ఈశాన్ సూడాన్‌లోని ఓని ప్రాంతంలో బంగారు గని షాఫ్ట్ ఒక్కసారిగా కూలిపోవడంతో భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. వాటి కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తుండటంతో సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.