ఖమ్మంలో సైబర్ నేరగాళ్లపై టీజీసీఎస్‌బీ ఉక్కుపాదం, భారీగా మ్యూల్ ఖాతాలు
రిపోర్టర్: హరి
స్థలం: ఖమ్మం
ఖమ్మం కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలపై టీజీసీఎస్‌బీ ఉక్కుపాదం మోపింది. 11 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి, 121 మ్యూల్ ఖాతాలను గుర్తించి 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రూ.7.84 కోట్ల లావాదేవీలను ఛేదించిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విదేశీ ఆపరేటర్ల ప్రమేయంతో జరుగుతున్న ఆన్‌లైన్ గేమింగ్ మాయాజాలాన్ని అణచివేసేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.