తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

తెలంగాణ రాష్ట్రంలో రాగల కొన్ని గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.