అమరావతి గ్రామకంఠం భూముల మినహాయింపులపై సీఆర్డీఏ కీలక స్పష్టత
రిపోర్టర్: వెంకట్
స్థలం: Amaravati
రాజధాని అమరావతి పరిధిలో గ్రామకంఠం భూముల మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టతనిచ్చింది. 2014 డిసెంబర్ 8కి ముందే నిర్మాణాలు ఉన్న భూములు, చదరపు గజాల ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లను మినహాయింపునకు పరిగణించినట్లు తెలిపింది. కటాఫ్ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్లు జరిగిన భూములకు మినహాయింపు వర్తించదని పేర్కొంది. ఇప్పటికే ఆరు వేలకు పైగా ఎకరాలను ఎల్పీఎస్ నుంచి మినహాయించామని, అపరిష్కృత దరఖాస్తుల పరిశీలనకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.