తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల నిర్వహణ విలువ రూ. 2.95 లక్షల కోట్లకు చేరుకుంది. తెలంగాణలో ఆస్తుల విలువ రూ. 2,12,856 కోట్లకు చేరగా ఇందులో హైదరాబాద్‌ వాటా 87 శాతంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ విలువ రూ. 82,409 కోట్లకు చేరుకున్నట్లు ఆంఫీ వెల్లడించింది. ఎస్ఐపీ విధానంపై అవగాహన పెరగడంతో యువత, మహిళలు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.