స్థానిక ఎన్నికల వేళ సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల పహారా
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలవరం డీఎస్పీ యు. రవిచంద్ర కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నితమైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.