గుజరాత్‌లో పాఠశాలలో చిన్నారిపై ఉపాధ్యాయురాలి దాడి కలకలం

రిపోర్టర్: కిరణ్ స్థలం: గుజరాత్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు లవ్‌ లెటర్ రాశాడనే కోపంతో నాల్గవ తరగతి విద్యార్థిపై పాఠశాల ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్ దాడి చేశారంటూ కుటుంబ సభ్యులు రామొల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లాస్‌రూమ్‌లో తోటి విద్యార్థినికి లవ్‌ లెటర్ విసిరాడనే కారణంతో ఉపాధ్యాయురాలు సీమా గోస్వామి, డైరెక్టర్ ఇంద్రజిత్ మౌర్య తన కుమారుడిని విచక్షణారహితంగా కొట్టారని బాలుడి తల్లి ఆరోపించగా, డబ్బుల కోసం కుటుంబసభ్యులు బెదిరింపులకు దిగుతున్నారని యాజమాన్యం తిప్పికొట్టింది.