కాపల్లి జిల్లాలో నూతిలో దూకి మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య

రిపోర్టర్: మహేష్ స్థలం: కె.కోటపాడు, అనకాపల్లి జిల్లా

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న డొంగల సత్యసాగర్, షీలా అరుణ అనే మైనర్ ప్రేమ జంట నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ మైనర్లు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదని, అందుకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.