గంగవరం వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలో భారీ వర్షాలకు చిన్న గంగవరం గ్రామంలోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీనివల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత వంతెన లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలోనూ తాము ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత బ్రిడ్జిని నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.