అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి యత్నం: నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Aurora
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలో ఉన్న హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు ప్రయత్నించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. నిందితుడు అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ ఇంట్లో పోలీసులు భారీగా ఆయుధాలు, వందల సంఖ్యలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సహోద్యోగి ఇచ్చిన సమాచారంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చిందని, భారతీయులపై హింసను ప్రేరేపించే పత్రాలను పోలీసులు గుర్తించారని అధికారులు వెల్లడించారు.