అనంతపురంలో మహిళ పట్ల ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా బత్తులపల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న మహిళతో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ తనతో దురుసుగా వ్యవహరించి నోటికొచ్చినట్లు మాట్లాడాడని ఆమె వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు డ్రైవర్ ను విచారిస్తున్నారని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.