ఏపీ హైకోర్టు జడ్జీల శాశ్వత నియామకానికి కొలీజియం సిఫారసు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి శాశ్వత జడ్జీల హోదా కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుల పేర్లతో కూడిన జాబితాను పంపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీరు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.