జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రపై సీబీఐ కేసు నమోదు

రిపోర్టర్: రాము స్థలం: India

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. నకిలీ పత్రాలతో తన నికర ఆస్తిని రూ. 59,113 కోట్లుగా చూపించి, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ను రూ. 1,322 కోట్ల మేర మోసం చేశారనేది ప్రధాన ఆరోపణ. ఎన్‌సీఎల్‌టీ తీర్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న వేళ, సీబీఐ రంగంలోకి దిగి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.