అంబేద్కర్ కాలనీలో ముళ్లపొదలను తొలగించి స్థానికుల పాముల భయాన్ని పారద్రోలిన సిబ్బంది
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి స్థానికుల భయాన్ని పోగొట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన గడ్డి కారణంగా పాములు సంచరిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్పందించిన కార్పొరేటర్ జీవీఆర్ తక్షణమే మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దించి శుభ్రం చేయించారు. తక్షణ స్పందనతో తమ ఇబ్బందులు తొలగించినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.