నగరంలో ముప్పై లక్షలతో సీసీ రోడ్డు పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నెల్లూరు
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. నగరంలోని నాల్గవ డివిజన్ కృష్ణవేణి స్కూల్ వీధిలో పదహారు లక్షలతో, ఏడవ డివిజన్ వైవీఎం ఎలిమెంటరీ స్కూల్ వద్ద ముప్పై లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు.